షట్‌డౌన్ కు తాత్కాలిక తెర
- January 26, 2019
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనల్డ్ ట్రంపు 35 రోజులుగా కొనసాగుతున్న ప్రభుత్వ షట్డౌన్లను తాత్కాలికంగా ప్రభుత్వ కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు ట్రంప్ తాజాగా వెల్లడించారు. దీంతో వచ్చే నెల 15వరకు అంటే మూడు వారాల పాటు తాత్కాలికంగా ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు. కాగా ఈ షట్‌డౌన్ అమెరికా చరిత్రలోనే సుదీర్ఘమైందిగా నిలిచింది. అక్రమ వలసలను నిర్మూలించేందుకు అమెరికామెక్సికో సరిహద్దులో భారీ గోడను నిర్మించాలని ట్రంప్ మొదటి నుంచి గట్టి పట్టుదలతో ఉన్న విషయం తెలిసిందే. అయితే ట్రంప్ నిర్ణయానికి విపక్ష డెమోక్రాట్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దీంతో ట్రంప్ పాక్షికంగా ప్రభుత్వ మూసివేతకు చర్యలు చేపట్టారు. ఈ పరిస్థితికి తెరదించేందుకు గురువారం ప్రవేశపెట్టిన రెండు బిల్లులను సైతం ఆ దేశ సెనేట్ తిరస్కరించింది. ఈ నేపథ్యంలో అధికార రిపబ్లికన్లు తాజాగా గోడ నిర్మాణ ప్రతిపాదనతో కూడిన బిల్లును మరోసారి ప్రవేశపెట్టారు. అయితే అధికార పక్షం, విపక్షాల మధ్య ఒప్పందం కుదరడంతో తాత్కాలికంగా షట్‌డౌన్ ఎత్తివేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







