దుబాయ్ లో ఘనంగా గణతంత్ర వేడుకలు
- January 26, 2019
యూఏఈలో వందలాది మంది భారతీయులు దుబాయ్‌లోని కాన్సులేట్ జనరల్ కార్యాలయం వద్ద జరిగిన భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాలుపంచుకున్నారు. యూఏఈలో భారత రాయబారి విపుల్, త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. భారతీయులంతా ఈ కార్యక్రమంలో దేశభక్తి గీతాల్ని ఆలపించారు. జాతీయ పతాకావిష్కరణ తర్వాత విపుల్, అక్కడికి చేరుకున్న భారతీయుల్ని ఉద్దేశించి ప్రసంగించారు. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని చదివి వినిపించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులను, వారి కుటుంబ సభ్యులను గుర్తుచేసుకున్నారు. పిల్లలు, పెద్దలు సంప్రదాయ వస్త్రధారణలో కనువిందు చేశారు. 



తాజా వార్తలు
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం







