ప్రముఖ ఎక్స్‌పో లాంఛ్‌ ప్రకటన

- January 26, 2019 , by Maagulf
ప్రముఖ ఎక్స్‌పో లాంఛ్‌ ప్రకటన

బహ్రెయిన్‌ టూరిజం మరియు ఎగ్జిబిషన్స్‌ అథారిటీ (బిఇటిఎ) చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ షేక్‌ ఖాలెద్‌ బిన్‌ హమౌద్‌ అల్‌ ఖలీఫా నేతృత్వంలో ఫస్ట్‌ ఎడిషన్‌ ఇంటర్నేషనల్‌ బ్రాండ్స్‌ అండ్‌ ఫ్రాంఛైజ్‌ ఎక్స్‌పో - ఐబిఎఫ్‌ఇఎక్స్‌ 2019 నిర్వహణపై ప్రకటన వెలువడింది. క్రౌన్‌ ప్రాజాలో బహ్రెయిన్‌ కాన్ఫరెన్స్‌ సెంటర్‌లో ఈ మేరకు వివరాల్ని వెల్లడించారు. ఫిబ్రవరి 11 నుంచి 13 వరకు ఈ ఎక్స్‌పో జరుగుతుంది. ఈ ఎక్స్‌పోలో వివిధ దేశాలకు చెందిన పలు సంస్థలు పాల్గొంటాయనీ, ఇన్వెస్టిమెంట్‌ విభాగంలో ఈ ఎక్స్‌పో ఎంతో ఉపయుక్తంగా వుంటుందని నిర్వాహకులు తెలిపారు. యునైటెడ్‌ నేషన్స్‌ ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌, అరబ్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌, మెనా సెంటర్‌ ఫర్‌ ఇన్వెస్టిమెంట్‌, ఫ్రాంఛైజ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ది మిడిల్‌ ఈస్ట్‌ తదితర సంస్థలు ఈ ఎక్స్‌పో నిర్వహణలో భాగస్వాములుగా వున్నాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com