భారత సంతతికి చెందిన ఇద్దరు మహిళలు అమెరికా ప్రెసిడెంట్ పదవికి పోటీ!
- January 26, 2019
అమెరికాలో రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. భారత సంతతికి చెందిన తులసీ గబ్బార్డ్ US ప్రెసిడెంట్ పదవికి పోటీ పడుతున్నారు. అతిపిన్న వయస్సులోనే ప్రతినిధుల సభకు ఎంపికై రికార్డు సృష్టించిన ఆమె సైన్యంలో పనిచేశారు. చిన్నప్పటి నుంచే హిందూ బావాలను, పద్దతులను అనుసరిస్తున్న తులసీ, అమెరికా రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు.
అమెరికాలో వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేయున్నట్లు మరో భారతీయ అమెరికన్ సెనెటర్ కమలా హ్యారీస్ ప్రకటించారు. 2020 లో జరిగే ప్రెసిడెంట్ రేస్ లో డెమోక్రటిక్ పార్టీ తరుపున పోటీచేయనున్నట్లు వెల్లడించారు. కాలిఫోర్నియా నుంచి సెనెటర్ గా ఎన్నికైన తొలి భారత సంతతి మహిళ కమలా చరిత్రకెక్కారు.
పౌర హక్కులపై పోరాడుతూ మంచి గుర్తింపు పొందారు. ట్రంప్ వలస విధానాలను, ఇష్టానుసారంగా పదవుల్లో నియామకాల తీరును ఎండగడుతూ ఆమె తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. కమలా హ్యారీస్ తల్లి తమిళనాడుకు చెందిన శ్యామలా గోపాలన్. ఆఫ్రికా -ఆసియా సంతతికి చెందిన తల్లిదండ్రుల కూతూరు కావడంతో కమలా హ్యారీస్ ను రాజకీయంగా బరాక్ ఒబామాతో పోలుస్తారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..