ఐఏఎస్‌, ఐపీఎస్‌లు ఓల్వో బస్సుల్లో విజయవాడ నుంచి హైదరాబాద్‌కు..

- December 26, 2015 , by Maagulf
ఐఏఎస్‌, ఐపీఎస్‌లు  ఓల్వో బస్సుల్లో విజయవాడ నుంచి హైదరాబాద్‌కు..

విజయవాడ: లోటు బడ్జెట్‌లో ఉన్న ఏపీ ప్రభుత్వం వీలైనంత వరకు పొదుపు చర్యలు చేపట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలోపెట్టాలని భావిస్తోంది. ఈ మేరకు ఆర్థిక శాఖ అధికారులు పొదుపు చర్యలను ముమ్మరం చేస్తున్నారు. దీనిపై సీఎం చంద్రబాబుకు ఆ శాఖ అధికారులు ప్రతిపాదన చేయడం..ఆయన పచ్చజెండా ఊపడం జరిగిపోయింది. దీంతో..ఇప్పటి వరకూ..ఐఏఎస్‌, ఐపీఎస్‌లు అధికారులు విజయవాడ నుంచి హైదరాబాద్‌కు విమానంలో ప్రయాణించేవారు. అయితే..ఆర్థిక శాఖ అధికారులు తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఐఏఎస్‌, ఐపీఎస్‌లు ఇక నుంచి ఓల్వో బస్సుల్లో విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లాల్సి ఉంటుంది. వారు ప్రయాణించడానికి రెండు ఓల్వో బస్సులను ఏపీ ప్రభుత్వం అతి త్వరలోనే కొనుగోలు చేయనున్నట్లు తెలిసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com