ఇటాలియన్ క్రూజ్ షిప్లో షేక్ మొహమ్మద్
- January 28, 2019
దుబాయ్ రూలర్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, దుబాయ్‌లోని పోర్ట్ ఆఫ్ రషీద్‌లో ఇటలియన్ క్రూజ్ షిప్ ఎంఎస్సి స్ప్లెండిడాను సందర్శించారు. క్రూజ్ షిప్లో ఆయన కలియతిరిగారు. ఈ భారీ షిప్లో వున్న సౌకర్యాల్ని ఆయన తెలుసుకున్నారు. షిప్లో మొత్తం 1,300 మంది సిబ్బంది రోజులో 24 గంటలూ పనిచేస్తారు, షిప్లో వున్న అతిథులకు సహాయ సహకారాలు అందిస్తారు, వారి సేవలో తరిస్తారు. ప్రపంచంలోని వివిధ దేశాల పర్యాటకులకు యూఏఈ స్వర్గధామం లాంటిదని ఈ సందర్భంగా షేక్ మొహమ్మద్ చెప్పారు. టూరిజం రంగంలో అభివృద్ధి దేశానికి ఎంతో ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. షేక్ మొహమ్మద్ వెంట దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రెసిడెంట్ షేక్ అహ్మద్ బిన్ సయీద్ అల్ మక్తౌమ్, ఎమిరేట్స్ గ్రూప్ ఛైర్మన్ మేజర్ జనరల్ మొహమ్మద్ అహ్మద్ అల్ మర్రి, డైర్టెర్ జనరల్ ఆఫ్ ది జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ మరియు ఫారిన్ ఎఫైర్స్ - దుబాయ్ ఖలీఫా సయీద్ సులేమాన్ తదితరులు షిప్‌ని సందర్శించినవారిలో వున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..