బైక్ రైడింగ్ ప్రియుల కోసం అకాడమీ ప్రారంభం
- January 28, 2019
బహ్రెయిన్:బైక్ రైడింగ్ మీద ప్రత్యేక ఆసక్తి గలవారి కోసం కింగ్డమ్లో అకాడమీ ప్రారంభమయ్యింది. అడిబీ రేసింగ్ అకాడమీ 2018లో ఏర్పాటు చేశారు. ప్రొఫెషనల్ రేసర్ అలి అడిబి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మూడు రోజుల ప్రోగ్రామ్ని బైక్ రైడర్స్ కోసం ఈ అకాడమీలో అందుబాటులోకి తెచ్చారు. అడిబి రేసింగ్, బహ్రెయిన్‌కి ప్రాతినిథ్యం వహిస్తోన్న ప్రీమియర్ మోటర్ బైక్ రేసింగ్ టీమ్. జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఈ రేసింగ్ సంస్థ పలు రేస్‌లలో పాల్గొంది. మినీ మోటర్ బైక్‌ల మీద శిక్షణ ఇస్తామనీ, వీటి ఖరీదు తక్కువనీ, అదే సమయంలో భద్రత పరంగా ఎంతో మెరుగైనవనీ అడిబి చెప్పారు. భవిష్యత్తులో తమ సంస్థ కార్యకలాపాల్ని మరింత విస్తరించనున్నట్లు ఆయన తెలిపారు. రైడర్స్‌కి ట్రైనింగ్ ఇవ్వడం రిక్రూట్ చేయడం ద్వారా స్థానిక రేసర్స్, ప్రపంచ స్థాయిలో సత్తా చాటేందుకు వీలుంటుందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..