మమ్ముట్టితో తొలిసారి సన్నీలియోన్
- January 29, 2019
హాట్ బ్యూటీ సన్నీలియోన్ బాలీవుడ్ కంటే సౌత్‌పై ఎక్కువగా ఫోకస్ చేసిందా? అవుననే అంటున్నారు కొంతమంది ప్రొడ్యూసర్లు. మోలీవుడ్లో ఈమెకున్న క్రేజ్ అంతాఇంతా కాదు. ఇటీవల ఓ మొబైల్ షాపు ఓపెనింగ్‌కి కేరళకు వెళ్లిన సన్నీని చూసేందుకు యూత్ ఓ రేంజ్లో ఎగబడింది. దీన్ని గమనించిన కొందరు ప్రొడ్యూసర్లు.. ఆమె క్రేజ్‌ని తమకు అనుకూలంగా మలచుకోవాలని ఆలోచన చేశారు. ఈ నేపథ్యంలో మమ్ముట్టితో 'మధుర రాజా' సినిమా మొదలుపెట్టేశారు. షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది.
ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. సన్నీలియోన్ స్పెషల్‌సాంగ్ చేస్తోంది. మమ్ముటితో కలిసి తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోనుంది సన్నీ. ఈ సాంగ్ మూవీకే హైలైట్ అని చెబుతోంది యూనిట్. అందుకు సంబంధించిన పిక్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
షెడ్యూల్ ప్రకారం ఈ ఫిల్మ్‌ని ఏప్రిల్‌లో రిలీజ్ చేయాలన్నది మేకర్స్ ప్లాన్. వైశాఖ్ డైరెక్ట్ చేస్తున్న ఫిల్మ్‌లో తమిళ నటుడు జై, జగపతిబాబు కీలకపాత్ర పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..