ఇరాక్ లో చిక్కుకున్న 14 మంది బాధితులకు విముక్తి
- January 29, 2019
హైదరాబాద్:ఇరాక్ లో చిక్కుకున్న 14 మంది బాధితులకు ఎట్టకేలకు విముక్తి లభించింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన 14మంది ఏజెంట్ చేతిలో మోసాపోయి ఐదు నెలలుగా నరక యాతన అనుభవించారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి ఇరాక్ లో చిక్కున్న వారిని స్వదేశానికి తీసుకు వచ్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంది. దీంతో రేపు ఉదయం హైదరాబాద్ కు బాధితులు చేరుకోనున్నారు. ఏజెంట్ చేతిలో మోసపోయి ఎటువంటి ఉద్యోగం లేకుండా ఐదు నెలలపాటు ఒకే గదిలో బందీలుగా ఉండిపోయిన సంగతి తెలిసిందే. తమ వారిని ఎలాగైనా కాపాడాలని కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.ఈ సమస్యను పాట్కూరి బసంత్ రెడ్డి(గల్ఫ్ తెలంగాణ వర్కర్స్ వెల్ఫేర్ & కల్చరల్ అసోసియేషన్) ఎంపీ కవితకు తెలియజేసారు. విదేశాంగ శాఖతో మాట్లాడి, ఇరాక్ లో చిక్కుకున్న 14 మంది తెలంగాణ కార్మికులను స్వదేశానికి రప్పించడంలో ఎంపీ కవిత కీలకపాత్ర పోషించారు. చొరవ తీసుకుని 14 మందికి విముక్తి కలిగించినందుకు బాధిత కుటుంబాలు ఎంపీ కవితకు ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..