‘5జీ’ టెక్నాలజీలో ఉద్యోగావకాశాలు..
- January 31, 2019
ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్న టెలికం రంగంలో 5జీ టెక్నాలజీ త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ తరుణంలో బిఎస్ఎన్ఎల్ పీజీ డిప్లొమా ఇన్ టెలికం టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ (పిజిడిటిటిఎం) కోర్సును ఆఫర్ చేస్తోంది.
బిఎస్ఎన్ఎల్కు చెందిన ఉన్నత స్థాయి మేనేజ్మెంట్ (నేషనల్ అకాడమీ ఆఫ్ టెలికం ఫైనాన్స్ అండ్ మేనేజ్ మెంట్) ద్వారా సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (హెచ్‌సియూ) తో కలిసి ఈ కోర్సును నిర్వహిస్తోంది. ఏడాది కాల వ్యవధి ఉన్న ఈ కోర్సును దూర విద్యా విధానంలో అభ్యసించవచ్చు. రెండు సెమిస్టర్లలో కోర్సును పూర్తి చేసే వీలుంటుంది.
ప్రతి సెమిస్టరు చివరిలో ఆరు రోజుల ప్రాక్టికల్స్ ద్వారా అభ్యర్థికి అవసరమైన సాంకేతిక విజ్ఞానం అందుతుంది. బిఎస్ఎన్ఎల్ విస్త్రృత నెట్వర్క్ ల్యాబ్స్ నేరుగా బిటిఎస్, ఓఎఫ్‌సి, ట్రాన్స్మిషన్, సిస్టమ్‌పై అభ్యర్థులకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. ఇతర దూర విద్యా విధానంలో నిర్వహిస్తున్న కోర్సులతో పోల్చితే ఈ కోర్సు భిన్నంగా, అధునాతనంగా ఉంటుంది.
ప్రతి సెమిస్టరుకు రూ.20,000 కోర్సు ఫీజు ఉంటుంది. దరఖాస్తు, ఇతర పూర్తి వివరాలకు www.natfm.bsnl.co.in/ వెబ్ సైట్ చూడవచ్చు. ఫోన్ ద్వారా కూడా వివరాలు తెలుసుకోవచ్చు. 040-29800342/23002366/23006598/9491069400. కోర్సులో చేరడానికి చివరి తేదీ: 2019 ఫిబ్రవరి 28.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..