ఇవి మీకు తెలుసా? - 1
- May 12, 2015
, by Maagulf
- అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి.
- కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది.
- నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.
- గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.
- అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తరచుగా తింటే మలబద్దకం పోతుంది.
- జామపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి.
- బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది.
- సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే, పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది.
- మామిడిపండుకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి ఉంది.
- బీట్ రూట్.. బీపీని క్రమబద్దీకరిస్తుంది.
- మునగాకు తింటే గ్యాస్ట్రిక్ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.
- దానిమ్మరసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది.
- ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ది చెందుతుంది.
- అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. మలబద్దకాన్ని కూడా వదిలిస్తుంది.
- కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్ లు శిరోజాలకు మేలు చేస్తాయి.
- మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్ ని దరికి చేరనివ్వదు.
- ద్రాక్షలో అధికపాళ్ళలో ఉండే బోరాన్.. ఆస్టియో పొరాసిస్ రాకుండా కాపాడుతుంది.
- బీట్ రూట్ రసం ‘లో బీపీ ‘ సమస్య నుంచి గట్టేక్కిస్తుంది.
- క్యారెట్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.
- మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషదం.