పోప్‌ ఫ్రాన్సిస్‌ యూఏఈ పర్యటన: 700 మంది జర్నలిస్టుల కవరేజ్‌

- January 31, 2019 , by Maagulf
పోప్‌ ఫ్రాన్సిస్‌ యూఏఈ పర్యటన: 700 మంది జర్నలిస్టుల కవరేజ్‌

30 దేశాలకు చెందిన 700 మంది జర్నలిస్టులకు నేషనల్‌ మీడియా కౌన్సిల్‌ (ఎన్‌ఎంసీ), మూడు రోజులపాటు పోప్‌ ఫ్రాన్సిస్‌ యూఏఈ పర్యటనను కవర్‌ చేసేందుకు అనుమతిచ్చింది. ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు యూఏఈలో పోప్‌ ఫ్రాన్సిస్‌ పర్యటన జరుగుతుంది. కేథలిక్‌ చర్చ్‌ హెడ్‌ అయిన పోప్‌ ఫ్రాన్సిస్‌ ఇచ్చే సందేశం గురించి ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తుందనీ, యూఏఈలో ఆయన పర్యటన ఎంతో ఆసక్తిదాయకంగా జరగనుందనీ ఈ నేపథ్యంలో ఆయన పర్యటనను కవరేజ్‌ చేయడానికి వివిధ దేశాలకు చెందిన జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో యూఏఈకి రానున్నారనీ అధికారులు తెలిపారు. యూరోప్‌కి చెందిన యూరోపియన్‌ ప్రెస్‌ ఫొటో ఏజెన్సీ, రుప్‌ట్లీ టీవీ మరియు కేథోలిషె నాచిరిచ్‌టన్‌ అజెంటుర్‌ (జర్మనీ), రేడియో ఫ్రాన్స్‌, లె ఫిగారో, ఎఎఫ్‌పి మరియు ఫ్రాన్స్‌ 24 మీడియా సంస్థలు పోప్‌ పర్యటనను కవర్‌ చేయబోతున్నాయి. టర్కీ, అర్జెంటీనా, మెక్సికో, ఫిలిప్పీన్స్‌, హాంగ్‌కాంగ్‌, జపాన్‌ నుంచి కూడా జర్నలిస్టులు రానున్నారు. షేక్‌ జాయెద్‌ మాస్క్‌ సహా పలు ముఖ్యమైన ప్రాంతాల్ని యూఏఈ పర్యటనలో భాగంగా పోప్‌ సందర్శిస్తారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com