పోప్ ఫ్రాన్సిస్ యూఏఈ పర్యటన: 700 మంది జర్నలిస్టుల కవరేజ్
- January 31, 2019
30 దేశాలకు చెందిన 700 మంది జర్నలిస్టులకు నేషనల్ మీడియా కౌన్సిల్ (ఎన్ఎంసీ), మూడు రోజులపాటు పోప్ ఫ్రాన్సిస్ యూఏఈ పర్యటనను కవర్ చేసేందుకు అనుమతిచ్చింది. ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు యూఏఈలో పోప్ ఫ్రాన్సిస్ పర్యటన జరుగుతుంది. కేథలిక్ చర్చ్ హెడ్ అయిన పోప్ ఫ్రాన్సిస్ ఇచ్చే సందేశం గురించి ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తుందనీ, యూఏఈలో ఆయన పర్యటన ఎంతో ఆసక్తిదాయకంగా జరగనుందనీ ఈ నేపథ్యంలో ఆయన పర్యటనను కవరేజ్ చేయడానికి వివిధ దేశాలకు చెందిన జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో యూఏఈకి రానున్నారనీ అధికారులు తెలిపారు. యూరోప్‌కి చెందిన యూరోపియన్ ప్రెస్ ఫొటో ఏజెన్సీ, రుప్ట్లీ టీవీ మరియు కేథోలిషె నాచిరిచ్టన్ అజెంటుర్ (జర్మనీ), రేడియో ఫ్రాన్స్, లె ఫిగారో, ఎఎఫ్‌పి మరియు ఫ్రాన్స్ 24 మీడియా సంస్థలు పోప్ పర్యటనను కవర్ చేయబోతున్నాయి. టర్కీ, అర్జెంటీనా, మెక్సికో, ఫిలిప్పీన్స్, హాంగ్‌కాంగ్, జపాన్ నుంచి కూడా జర్నలిస్టులు రానున్నారు. షేక్ జాయెద్ మాస్క్ సహా పలు ముఖ్యమైన ప్రాంతాల్ని యూఏఈ పర్యటనలో భాగంగా పోప్ సందర్శిస్తారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..