భారత కేంద్ర బడ్జెట్ అప్ డేట్స్..

- February 01, 2019 , by Maagulf
భారత కేంద్ర బడ్జెట్ అప్ డేట్స్..

తాత్కాలికంగా ఆర్థిక శాఖ బాధ్యతలు చేపట్టిన పీయూష్‌ గోయల్‌ బడ్జెట్‌ ప్రసంగం పార్లమెంట్‌లో ఇలా సాగింది.

 
– ఆదాయ పన్ను పరిమితి రూ. 5 లక్షలకు పెంపు

– రానున్న ఐదేళ్లలో 5 లక్షల కోట్ల డాలర్ల విలువకు దేశ ఆర్థిక వ్యవస్థ
– ఎనిమిదేళ్లలో 10 ట్రిలియన్ డాలర్లకు దేశ జీడీపీ(ఆర్థిక వ్యవస్థ)- గోయల్‌ అంచనా
– గత ఐదేళ్లలో దేశీయంగా విమానప్రయాణికుల సంఖ్య రెట్టింపునకు చేరిక
– దేశవ్యాప్తంగా నిర్వహణలోకి వచ్చిన 100కుపైగా విమానాశ్రయాలు 
– నల్లధన కట్టడి చర్యలలో భాగంగా రూ. 50,000 కోట్లు సీజ్‌ 
– రూ. 6,900 కోట్ల విలువైన ఆస్తుల స్వాధీనం

– ఆదాయ పన్ను పరిమితులూ, మినహాయింపులూ యథాతథంగా కొనసాగింపు
– 24 గంటల్లోగా ఆదాయ పన్ను రిటర్నుల ప్రాసెస్‌
– 2014లో నమోదైన 3.79 కోట్ల నుంచి 2018కల్లా 6.85 కోట్లకు పెరిగిన పన్ను మదింపుదారులు 

– 2020 రక్షణ బడ్జెట్‌ రూ. 3 లక్షల కోట్లు- అవసరమైతే మరిన్ని నిధుల కేటాయింపునకు ప్రణాళికలు
– సామాజిక న్యాయ శాఖ అధ్యక్షతన సంక్షేమ అభివృద్ధి బోర్డు ఏర్పాటు
– ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకంలో భాగంగా ఇప్పటివరకూ 6 కోట్ల ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్లు. 
– వంట కోసం కలప వినియోగానికి స్వస్తి చెప్పేబాటలో మహిళలకు మరో 8 కోట్ల ఎల్‌పీజీ కనెక్షన్ల జారీకి ప్రణాళికలు.
– సడక్‌ యోజన పథకానికి రూ. 19,000 కోట్లు

– పశుపోషణ, సంరక్షణ చేపట్టే రైతులకు 2 శాతం వడ్డీ రాయితీ పథకం- సక్రమ చెల్లింపులకు మరో 3శాతం వడ్డీ రాయితీ
– ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయే రైతులకు 2 శాతం ముందస్తు వడ్డీ రాయితీ
– అసంఘటిత రంగంలో పనిచేసేవారికి మెగా పెన్షన్‌ పథకం- రిటైర్‌ అయ్యాక 60 ఏళ్ల వయసు నుంచి నెలకు రూ. 3000 పెన్షన్‌

– మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకానికి రూ. 5,000 కోట్ల అదనపు కేటాయింపు- రూ. 60,000 కోట్లకు నిధులు
– కిశాన్‌ సమ్మాన్‌నిధిలో భాగంగా 2 హెక్టార్ల భూమిగల రైతులకు ఏడాదికి రూ. 6,000 కేటాయింపు
– ఆయుష్మాన్‌ భారత్ ద్వారా 10 లక్షల మంది ప్రజలకు వైద్య సేవలు
– 2014 నుంచి 14 కొత్త AIIMS ప్రకటన- 22వ AIIMS ఆసుపత్రి హర్యానాలో ఏర్పాటు


– 2018-19 ద్రవ్యలోటు లక్ష్యం 3.4 శాతానికి సవరింపు
– కరెంట్‌ ఖాతా లోటు లక్ష్యం 2.5 శాతంగా నిర్ణయం
– ఆటోమాటిక్‌ మార్గంలోనే అధిక శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు
– ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 2.6 లక్షల కోట్ల పెట్టుబడులు
– ఐబీసీ చర్యల ద్వారా రూ. 3 లక్షల కోట్ల రికవరీ
– 2014లో బ్యాంకుల మొండిబకాయిలు రూ. 5.4 లక్షల కోట్లు
– రెరా, బినామీ ప్రాపర్టీ చట్టాల ద్వారా రియల్టీ రంగంలో పారదర్శకతకు బీజం  
– దిద్దుబాటు చర్యల నుంచి మూడు బ్యాంకులకు ఉపశమనం- ఈ బాటలో మరిన్ని బ్యాంకులకు మద్దతు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com