గ్లోబల్‌ ఛైర్మన్‌గా బహ్రెయినీ ఎంపిక

- February 01, 2019 , by Maagulf
గ్లోబల్‌ ఛైర్మన్‌గా బహ్రెయినీ ఎంపిక

కాలిఫోర్నియాలోని గ్లోబల్‌ బోర్డ్‌ - సోషల్‌ మీడియా క్లబ్‌ గ్లోబల్‌ ఛైర్మన్‌గా బహ్రెయిన్‌కి చెందిన సోషల్‌ మీడియా క్లబ్‌ మెనా అండ్‌ బహ్రెయిన్‌ ఫౌండర్‌ మరియు ప్రెసిడెంట్‌ అలి సబ్కార్‌ని ఏకగ్రీవంగానెంపిక చేశారు. అతి పెద్ద వర్చ్యువల్‌ మార్కెటింగ్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ ఇండివిడ్యువల్స్‌ అండ్‌ ఆర్గనైజేషన్స్‌ ఫౌండర్‌ అయిన అలీ, బహ్రెయిన్‌ మరియు జిసిసి దేశాలకు సంబంధించి మార్కెటింగ్‌లో తనదైన ముద్ర వేశారు. 4,000 మెంబర్స్‌ అలాగే పెద్ద సంఖ్యలో ఇ- కామర్స్‌ ప్రాజెక్ట్స్‌ అలీ ప్రత్యేకతలుగా చెప్పుకోవచ్చు. బహ్రెయిన్‌, కువైట్‌ మరియు కెఎస్‌ఎలో 300కి పైగా కార్పొరేట్‌ వెబ్‌సైట్స్‌ డెవలప్‌మెంట్‌లో కలక భూమిక పోషించారు అలీ. 2016 జనవరి నుంచి అలీ, కరోలిన్‌ జోన్స్‌తో కలిసి గ్లోబల్‌ కో-ఛెయిర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ కొత్త గౌరవం తనకెంతో ఆనందాన్నిస్తోందని అలీ చెప్పారు. 2019-20 సంవత్సరానికిగాను మరింత మెరుగైన ఆలోచనలతో ముందడుగు వేస్తామని ఆయన వివరించారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com