యూఎస్:అరెస్టైన విద్యార్థుల కోసం ఎంబసీ హాట్ లైన్
- February 02, 2019అమెరికాలో సంచలనం సృష్టించిన పే టు స్టే కుంభకోణంలో పోలీసులు అరెస్ట్ చేసిన విద్యార్థుల కోసం భారతీయ రాయబార కార్యాలయం హాట్ లైన్ ఏర్పాటు చేసింది. ఈ హాట్ లైన్ 24/7 పనిచేస్తుందని ఎంబసీ అధికారులు వెల్లడించారు. సుమారు 129మంది భారతీయ విద్యార్థుల్ని అరెస్టు చేసినట్లు అక్కడి యంత్రాంగం ప్రకటించింది. ఈ హాట్ లైన్ లో 202-322-1199, 202-340-2590 నెంబర్లపై అరెస్ట్ అయిన విద్యార్థుల స్నేహితులు, కుటుంబ సభ్యులు ఎప్పుడై ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని ప్రకటించారు.
న్యూజెర్సీ, అట్లాంటా, హ్యూస్టన్, మిషిగాన్, కాలిఫోర్ని యా, లూసియానా, నార్త్ కరోలినా, మిస్సోరి రాష్ర్టాల్లో ప్రత్యేక దాడులు నిర్వహించి విద్యార్థులను యూస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరందరిపై పౌర వలస నిబంధనల చట్టం ప్రకారం అభియోగాలు నమోదు చేయనున్నట్లు ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వెల్లడించారు. వీరంతా హోం ల్యాండ్ సెక్యురిటీ ఇన్వెస్టిగేషన్ అధికారుల స్ట్రింగ్ ఆపరేషన్ లో పట్టుబడ్డారు. వీసా నిబంధనలు ఉల్లంఘించి అమెరికాలోనే ఉండేందుకు ఈ విద్యార్థులంతా డెట్రాయిట్‌లోని ఫార్మింగ్టన్ యూనివర్సిటీలో చేరారు. భారతీయ విద్యార్థులకు సహకారం అందించేందుకు సంబంధిత అమెరికా అధికారులతో చర్చలు జరుపుతున్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ