హాలీవుడ్ సినిమాకు హీరోగా టాలీవుడ్ నటుడు
- February 02, 2019
అర్జున్‌రెడ్డి సినిమాతో రాత్రిరాత్రికే స్టార్ నటుడు అయిపోయారు రాహుల్ రామకృష్ణ. తర్వాత హుశారు, సమ్మోహనం, గీత గోవిందం ,అలాగే స్టార్ హీరో మహేష్ బాబు
నటించిన భరత్ అనే నేను లాంటి సినిమాలలో సందడి చేశారు. ఇప్పుడు రాహుల్ ఓ హాలీవుడ్ సినిమాలో కథానాయకుడుగా నటించబోతున్నారు. ఈ సినిమాకు
“సిల్క్ రోడ్” అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రానికి ప్రదీప్ కటసాని దర్శకత్వ, నిర్మాణ భాద్యతలు నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన పోస్టర్‌ను రాహుల్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. “ఈ సినిమా సంబంధించిన విషయం నేను ఉహించిన దాని కంటే వేగంగా బయటకు వచ్చింది. చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్న నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. హాలీవుడ్‌లోకి ఎంట్రి ఇవ్వబోతున్నాను. మేము పడే కష్టానికి ఫలితం దక్కుతుందని ఆశిస్తున్నానని తెలిపారు.
అమెరికాలో నివసించే తెలుగు విద్యార్థుల నేపథ్యం అధారంగా ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు సమాచారం. అక్కడ ఉండే అసాంఘిక వ్వవహరాలు మన విద్యార్థులపై ఏవిధంగా ప్రభావం చూపుతున్నాయి. సైబర్ క్రైమ్, డ్రగ్స్ చుట్టూ స్టోరీ సాగనున్నట్లు తెలుస్తుంది. దాదాపు 2గంటల విడిదితో ఈ చిత్రం ఉండనుంది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!