కువైట్‌లో కార్ల దొంగ అరెస్ట్
- February 02, 2019
కువైట్: 38 ఏళ్ళ కువైటీ సిటిజన్ని కార్ల దొంగతనం కేసుకి సంబంధించి పోలీసులు అరెస్ట్ చేశారు. అర్దియా ప్రాంతంలోని ఓ వెడ్డింగ్ హాల్లో పార్క్ చేసిన కారు నుంచి నిందితుడు విలువైన వస్తువుల్ని దొంగిలించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అతన్ని పట్టుకున్నారు. ఫర్వానియా సెక్యూరిటీ మెన్ నిందితుడ్ని పట్టుకుని, అతని నుంచి పలు విలువైన వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు. క్రెడిట్‌కార్డులు, సెల్ ఫోన్స్, వాహనాల అద్దాల్ని పగలగొట్టేందుకు, డోర్లను తెరిచేందుకు వినియోగించే ఉపకరణాల్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. పలు కార్లలో ఇలా తాను దొంగతనాలకు పాల్పడినట్లు నిందితుడు అంగీకరించాడు. నిందితుడ్ని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ డిపార్ట్మెంట్కి అప్పగించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..