ఎమిరేట్స్ విమానం ఎమర్జన్సీ ల్యాండింగ్
- February 02, 2019
దుబాయ్ నుంచి జకార్తా వెళుతున్న ఎమిరేట్స్ విమానం అత్యవసరంగా కొచ్చిన్లో ల్యాండ్ అయ్యింది. విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో విమానాన్ని ఎమర్జన్సీ ల్యాండ్ చేసి, బాధితుడ్ని ఆసుపత్రికి తరలించారు. అయితే దురదృష్టవశాత్తూ ఆ ప్రయాణీకుడు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆసుపత్రి వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం మృతుడ్ని ఇండోనేసియాకి చెందిన 59 ఏళ్ళ వ్యక్తిగా గుర్తించారు. మృతదేహాన్ని ఆసుపత్రిలోని మార్చ్యురీలో వుంచారు. సంబంధీకులకు సమాచారం పంపించారు. ఫార్మాలిటీస్ అనంతరం, మృతదేహాన్ని స్వదేశానికి తరలిస్తారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







