యూఏఈ విచ్చేయనున్న పోప్..అసలెందుకింత ప్రాధాన్యం?
- February 03, 2019
దుబాయ్: క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ నేడు చారిత్రక పర్యటనకు బయల్దేరారు. దుబాయ్‌లో జరగనున్న 'ఇంటర్‌ఫెయిత్ కాన్ఫరెన్స్'కు ఆయన హాజరు కానున్నారు. ఈ సదస్సుకు హాజరుకావాలని అబుదాబీ యువరాజు షేక్ మహమ్మద్ బిన్ జయేద్ అల్ నెహ్యాన్ ఆయన్ను ఆహ్వానించారు. ఆయన ఇప్పటికే వాటికస్ సిటీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరారు. మంగళవారం జరగనున్న ఈ సదస్సుకు దాదాపు లక్షా 20 వేల మంది హాజరవుతారని అంచనా. ''సోదరభావం, సహనశీలతలకు నిదర్శనంగా ఉండేందుకు ప్రయత్నిస్తోంది. వివిధ సంస్కృతులు కలిసే ప్రదేశం'' అని పోప్ దుబాయ్‌కు కితాబిచ్చారు. తన పర్యటనలో భాగంగా కైరోకు చెందిన అల్-అజ్మర్ మసీదు ఇమామ్‌తో కూడా భేటీ కానున్నారు.
ఎందుకింత ప్రధాన్యం..
యెమన్‌లో జరుగుతున్న యుద్ధాన్ని పోప్ ఇప్పటికే చాలా ఖండించారు. ఈ యుద్ధంలో భాగంగా సౌదీతోపాటు యూఏఈ కూడా యెమన్‌పై దాడులు నిర్వహిస్తోంది. గత ఏడాది పోప్ మాట్లాడుతూ యెమన్‌లో మానవీయత దిగజారకుండా కాపాడుకోవాలని అంతర్జాతీయ సమాజాన్ని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో పోప్ ఇక్కడికి రానుండటం విశేషం. యుఏఈలో దాదాపు 10 లక్షల మంది రోమన్ కేథలిక్‌లు ఉన్నారు. వీరిలో అత్యధిక మంది భారత్, ఫిలిప్పన్స్ నుంచి వచ్చినారే.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







