యాత్ర మొదటి టికెట్ వేలం. కళ్లు చెదిరే రేటు.
- February 04, 2019
వైఎస్ఆర్ పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమా ఈనెల 8న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మధ్యే ప్రీ రిలీజ్ వేడుకను కూడా సినిమా జరుపుకుంది. యాత్ర సినిమాకు సంబంధించిన మొదటి టికెట్‌ను అమెరికాలోని సీటెల్‌లో వేలం వేశారు.
భారీ ధరకు మొదటి టికెట్ అమ్ముడుపోయింది. పలువురు అభిమానులు మొదటి టికెట్‌ను సొంతం చేసుకునేందుకు పోటీ పడ్డారు. మునీశ్వర్ అనే ఎన్ఆర్ఐ మొదటి టికెట్‌ను 6,116 డాలర్లకు సొంతం చేసుకున్నారు. మన కరెన్సీలో 4. 37లక్షలకు టికెట్ అమ్ముడుపోయింది.
టికెట్ అసలు ధర 12 డాలర్లు. మిగిలిన సొమ్మును వైఎస్ఆర్ ఫౌండేషన్‌ను విరాళంగా ఇస్తున్నట్టు వేలం నిర్వాహకులు తెలిపారు. 70 ఎమ్ఎమ్ ఎంటర్టైన్ మెంట్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో వైఎస్ పాత్రను మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..