ఆసక్తిని రేకెత్తిస్తోన్న రాజశేఖర్ కల్కి టీజర్
- February 04, 2019
రాజశేఖర్ కథానాయకుడిగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కల్కి సినిమా రూపొందుతోంది. యాక్షన్ కి .. ఎమోషన్ కి ప్రాధాన్యతనిస్తూ నిర్మాత సి.కల్యాణ్ తో కలిసి రాజశేఖర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ రోజున రాజశేఖర్ పుట్టినరోజు .. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమా నుంచి ఫస్టు టీజర్ ను రిలీజ్ చేశారు.
యాక్షన్ సీన్ పైనే ఈ టీజర్ ను కట్ చేశారు. వర్షంలో రాజశేఖర్ పై ఒక గ్యాంగ్ చేసే దాడిని ఈ టీజర్లో చూపించారు. రాజశేఖర్ సినిమా నుంచి ఆడియన్స్ ఆశించే యాక్షన్ ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. రాజశేఖర్ సరసన కథానాయికలుగా ఆదా శర్మ .. నందిత శ్వేత కనిపించనున్నారు. నిన్నమొన్నటి వరకూ అభిమానులతో యాంగ్రీ యంగ్ మేన్ అంటూ పిలిపించుకున్న రాజశేఖర్, ఈ సినిమాతో యాంగ్రీ స్టార్ గా ప్రేక్షకుల ముందుకు వస్తుండటం విశేషం.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







