సాహో లేటెస్ట్ అప్డేట్
- February 05, 2019
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - శ్రద్ద కపూర్ జంటగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం సాహో. ఈ సినిమా సెట్స్ మీద ఉందనే కానీ ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్ డేట్స్ లేకపోయేసరికి అభిమానులు ఈ సినిమా ఏం జరుగుతుందో తెలియక తికమక పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ నుండి ఓ వార్త బయటకు వచ్చింది.
యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ 50 శాతం పూర్తి అయ్యిందట. ఇండియాలోనే భారీ విజువల్స్ తో ఈ సినిమా రాబోతుందని , మే నెలకల్లా చిత్రం యొక్క పూర్తి వర్క్ పూర్తి చేయబోతారని , జూలై నుండి ప్రమోషన్స్ ను మొదలు పెట్టి ఆగష్టు 15న సినిమాను గ్రాండ్ గా విడుదల చేయబోతున్నట్లు తెలిపారు.
తెలుగు, హిందీ, తమిళ భాషల్లో భారీ స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రానికి 'రన్ రాజా రన్' ఫేమ్ సుజీత్ డైరెక్ట్ చేస్తుండగా, యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతం అందిస్తున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..