"వారి గౌరవానికి భంగం కలిగించొద్దు" అంటున్న `యాత్ర` దర్శకుడు
- February 06, 2019
మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి జీవితకథ ఆధారంగా దర్శకుడు మహి వి రాఘవ్ తెరకెక్కించిన చిత్రం `యాత్ర`. ఈ శుక్రవారం (ఫిబ్రవరి 8) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో అభిమానులను, ప్రేక్షకులను ఉద్దేశిస్తూ దర్శకుడు మహి ఓ లేఖను విడుదల చేశారు. ఎన్టీయార్, వైఎస్సార్ ఈ మట్టి వారసులని, మన అభిప్రాయ భేదాలతో వారి గౌరవానికి భంగం కలిగించకూడదని ఆ లేఖలో పేర్కొన్నారు.
`గొప్ప నాయకుడైన వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారి జీవితాన్ని తెరకెక్కించే అవకాశం నాకు రావడం అదృష్టంగా భావిస్తున్నా. వైఎస్సార్ కుటుంబ సభ్యులకు, ఆయన అభిమానులకు ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మా టీమంతా ఎంతో కష్టపడి ఈ సినిమాను తెరకెక్కించాం. ఈ సినిమాను మరో సినిమాతో పోల్చి రేసులో నిలబెట్టకండి. ఓ గొప్ప నాయకుడి ప్రయాణాన్ని సంతోషంగా ఆస్వాదిద్దాం. ఎన్టీయార్‌గారూ, వైఎస్సార్‌గారూ తెలుగు జాతి గర్వించదగిన గొప్ప దిగ్గజాలు. ఎంతో కీర్తిని వదలి వెళ్లిన ఈ మట్టి వారసులు.
మన అభిప్రాయ భేదాలతో వారి గౌరవానికి భంగం కలిగించొద్దు. వైఎస్‌ఆర్, చిరంజీవి గారిపట్ల నాకు చాలా ప్రేమ ఉంది. అంతమాత్రాన ఇతరుల మీద ద్వేషం కలగలేదు. మా `యాత్ర`ను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాన`ని మహి ఆ లేఖలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







