అయోగ్య..టెంపర్ రీమేక్ చిత్ర టీజర్ విడుదల
- February 07, 2019
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన చిత్రం టెంపర్ . ఈ సినిమా హిందీలో సింబా పేరుతో విడుదలై మంచి విజయం సాధించింది. ప్రస్తుతం తమిళంలో రీమేక్ అవుతుంది. నవ దర్శకుడు, ఏఆర్.మురుగదాస్ శిష్యుడు వెంకట్‌మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విశాల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు.ఆయన సరసన రాశీ ఖన్నా కథానాయికగా నటిస్తుంది. అయోగ్య అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్ర టీజర్ తాజాగా విడుదలైంది. ఇందులో విశాల్ తన మేనరిజంతో అదరగొట్టాడు. తమిళ నేటివిటీకి తగ్గట్టుగా పలు మార్పులు చేశారు. ఏప్రిల్‌లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేనున్నారు. అయోగ్య చిత్రానికి శ్యామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ సన్నీ లియోన్ ఓ ఐటెం సాంగ్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఓ పాటలో విశాల్‌తో కలిసి సన్నీ ఆడిపాడిందట. పార్థిపన్, కే.యస్.రవికుమార్‌లు ముఖ్యపాత్రలు పోషించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..