సినీ నటిని దారుణంగా హత్య చేసిన ప్రముఖ దర్శకుడు..
- February 07, 2019
ఓ కధని అందంగా ఎలా మలచాలి.. ప్రేక్షకులకు నచ్చేలా ఎలా చిత్రీకరించాలి.. దర్శకుడికి తెలిసినంత బాగా మరెవరికీ తెలియదేమో.. ఓ చిత్రం విజయవంతమైందంటే అందుకు కారణమైన దర్శకుడి ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి..
అయితే చిత్ర కథ, జీవితం ఒకటి కాదని నిరూపించాడు తమిళనాడు కోలీవుడ్‌కు చెందిన సహాయ దర్శకుడు బాలకృష్ణన్.. కట్టుకున్న భార్యను కనికరం లేకుండా కాళ్లు, చేతులు ముక్కలుగా నరికి తనలో ఉన్న విలనిజాన్ని బయటకు తీశాడు.. భార్య సంధ్య సినిమాల్లో నటిస్తోంది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
ఆమె మరొకరితో వివాహేతర సంబంధాన్ని పెట్టుకోవడంతో బాలకృష్ణన్ రగిలిపోయాడు. ఇలా చేయడం కరెక్ట్ కాదని ఎన్నో సార్లు భార్యని మందలించాడు. అయినా సంధ్య వినిపించుకోలేదు. రాత్రివేళలో సంధ్య ప్రియుడితో గంటల తరబడి ఫోన్లో మాట్లాడడం, తరచూ బయటకు వెళ్లడంతో బాలకృష్ణన్ జీర్ణించుకోలేకపోయాడు.
ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు, గొడవలు ప్రారంభమయ్యాయి. విషయం ఎలాగూ భర్తకు తెలిసిందని ఇక తాను ప్రియుడితోనే ఉంటానని తేల్చి చెప్పింది. దీంతో మరోసారి భార్యతో గొడవపడి సహనం కోల్పోయిన బాలకృష్ణన్ జనవరి 19న సంధ్యని విచక్షణా రహితంగా పొడిచి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ఐదు ముక్కలు చేసి గోనె సంచిలో కట్టి వాటిని వేర్వేరు ప్రదేశాల్లో పడేశాడు.
డంపింగ్ యార్డులో చెత్తను జేసీబీతో లోడింగ్ చేస్తుండగా కాళ్లు, చేతులను గుర్తించిన చెన్నై కార్పొరేషన్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఆమె చేతులపై శివుడు-పార్వతి టాటూ ఉన్నట్లు గుర్తించారు. మృతురాలు నటి సంధ్య అని తేల్చిన పోలీసులు ఆమె భర్త బాలకృష్ణన్‌ను విచారించడంతో హత్యోదంతం వెలుగులోకి వచ్చింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..