ఆగిపోయిన ఎస్‌యూవీ టైర్‌ మార్చిన యూఏఈ పోలీస్‌ అధికారి

- February 08, 2019 , by Maagulf
ఆగిపోయిన ఎస్‌యూవీ టైర్‌ మార్చిన యూఏఈ పోలీస్‌ అధికారి

యూ.ఏ.ఈ:ఓ పోలీస్‌ అధికారి, ఆగిపోయిన ఎస్‌యూవీ టైర్‌ని మార్చడం అందరి మనసుల్నీ గెల్చుకుంది. అటు వైపుగా వెళుతున్న ఓ వాహనం ఆగిపోయి వుండడాన్ని గమనించిన పోలీస్‌ అధికారి, అక్కడికి చేరుకుని సహృదయంతో ఆ ఎస్‌యూవీ టైర్‌ మార్చేందుకు ఉపక్రమించారు. ఈ విషయం తెలుసుకున్నవారంతా ఆశ్చర్యపోయారు. సోషల్‌ మీడియాలో ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారింది. పోలీస్‌ అధికారి టైర్‌ మార్చుతుండగా, ఓ యువకుడు ఆ తతంగాన్నంతా గమనించాడు. టైర్‌ మార్చిన అనంతరం ఆ యువకుడు ఆ వాహనంలో వెళ్ళిపోయాడు. పోలీస్‌ అధికారి సాయానికి యూఏఈ సమాజం అంతా సలాం కొడుతోంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com