టీడీపీ నిరసనలపై ప్రధాని స్పందన
- February 10, 2019
గుంటూరులో జరిగిన బీజేపీ ప్రజా చైతన్య సభలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ప్రధాని మోడీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు ప్రజలను గాలికి వదిలేసి తనను తిట్టే పనిపెట్టుకున్నారని మోడీ ఫైర్ అయ్యారు. మోదీ కంటే తాను సీనియర్ అని చంద్రబాబు చెబుతున్నారని. కొన్ని విషయాల్లో చంద్రబాబును మించిన సీనియర్లు లేరని ఎద్దేవా చేశారు.
పార్టీ ఫిరాయింపుల్లో, పదేపదే పొత్తులు మార్చడంలో చంద్రబాబును మించిన సీనియర్ లేరన్నారు. సొంత మామకే వెన్నుపోటు పొడిచి రాజకీయాల్లో ఎదగడంలో చంద్రబాబును మించిన సీనియర్ లేరన్నారు. చంద్రబాబు గతాన్ని మరిచిపోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను చీకట్లోకి నెట్టడంలో చంద్రబాబు సీనియర్ అని వ్యాఖ్యానించారు. ధర్మపోరాట దీక్ష పేరుతో ఫోటోలు తీయించుకునేందుకు చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారని విమర్శించారు. చంద్రబాబు తన దీక్షకు ఖర్చు పెడుతున్న సొమ్మంతా ప్రజా ధనమేనన్నారు. ఏపీని సన్రైజ్ స్టేట్ చేస్తానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు మాత్రం సొంత సన్ ని రాజకీయంగా ప్రజలపై రుద్దే పనిలో ఉన్నారన్నారు.
ఏపీలో కొత్తకొత్త పథకాలు తెస్తానని చెప్పిన చంద్రబాబు. ఇప్పుడు కేంద్రం తెచ్చిన పథకాలకు స్టిక్కర్లు అంటించుకుని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. స్వార్థం కోసం చంద్రబాబు రాష్ట్రాన్ని దెబ్బతీశారన్నారు. చంద్రబాబు ఏదో తప్పు చేశారు కాబట్టే భయపడుతున్నారన్నారు.
ఒకప్పుడు కాంగ్రెస్ను ఎన్టీఆర్ దుష్ట కాంగ్రెస్ అంటే ఇప్పుడు చంద్రబాబు మాత్రం దోస్త్ కాంగ్రెస్ అంటున్నారని మోడీ వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ ఒడిలో కూర్చోవాల్సిన అవసరం ఎందుకొచ్చిందో ప్రజలకు చంద్రబాబు చెప్పాలన్నారు. ఎన్నికల్లో ఓడిపోవడంలో చంద్రబాబును మించిన సీనియర్ లేరని మోడీ వ్యాఖ్యానించారు. కేంద్రం నుంచి వచ్చిన దానికి లెక్కలు చెప్పాల్సిందిగా కోరితే ఎందుకు చంద్రబాబు ప్రభుత్వం నోరు విప్పడం లేదని ప్రశ్నించారు.ఏపీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో తాను వెనుకడుగు వేయబోనన్నారు మోడీ.
ఏపీకి ప్రత్యేక ప్యాకేజీని తాము ప్రకటిస్తే ఇదే ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానాలు చేసింది నిజం కాదా అని మోడీ ప్రశ్నించారు. తనను తిడుతున్న చంద్రబాబు ముందు కేంద్రం నుంచి వచ్చిన నిధులను ఏం చేశారో చెప్పాలన్నారు. 55 నెలల పాటు ఏపీకి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూశామన్నారు. కానీ కేంద్రం ఎంత సాయం చేసినా చంద్రబాబు దాన్ని సరిగా ఖర్చు చేయలేకపోయారన్నారు. అమరావతిని నిర్మిస్తానని చెప్పిన చంద్రబాబు. ఇప్పుడు కూలిన తన పార్టీని నిర్మించుకునే పనిలో ఉన్నారని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంస్కారవంతులని దేశానికి మొత్తం తెలుసన్నారు. కానీ కొద్ది నెలలుగా చంద్రబాబు డిక్షనరీలో ఉన్న తిట్లన్నీ తనను తిట్టడానికి వాడుతున్నారని. ఇలా చేయడం ఆంధ్రుల సంస్కృతిని దెబ్బతీయడమేనన్నారు.
మీరు, మీ కుమారుడు లోకేష్ చేస్తున్న విన్యాసాలు, అభియోగాలను తాను గమనిస్తూనే ఉన్నానన్నారు. తండ్రి కొడుకుల రాజకీయానికి త్వరలోనే ముగింపు పడబోతోందన్నారు. తాను ఏపీకి వచ్చిన సందర్బంగా టీడీపీ, వారి మిత్రులు నల్ల బెలూన్లు ఎగరేశారని.. అవి తమకు దిష్టి తగలకుండా చేస్తాయన్నారు. తనను గో బ్యాక్ అంటున్నారని.. అంటే వెళ్ళి కేంద్రంలో అధికార పీఠం మీద కూర్చోమంటున్నారని అందుకు కృతజ్ఞతలని అన్నారు.
ఆఖరిలో జై ఆంధ్రా, భారత్ మాతాకీ జై అంటూ ముగించారు మోడీ.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..