ఇండియన్ సోషల్ వర్కర్ని సత్కరించనున్న సొసైటీ
- February 11, 2019
బహ్రెయిన్: ప్రముఖ సోషల్ వర్కర్, యాక్టివిస్ట్ దయా బాయ్‌ని సిమ్స్ జిఎఫ్ఎస్ఎస్ వర్క్ ఆఫ్ మెర్సీ పురస్కారంతో సత్కరించనున్నట్లు సైరో మలబార్ సొసైటీ (ఎస్‌వైఎమ్‌ఎస్) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పేర్కొనడం జరిగింది. సెంట్రల్ ఇండియాలో ట్రైబల్స్ అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్ కోసం ఆమె అందించిన సేవలకు గుర్తుగా ఈ గౌరవం ఆమెకు దక్కుతోంది. మనామాలో మార్చి 1న ఇండియన్ క్లబ్ ఆడిటోరియం ఇందుకు వేదిక కానుంది. 2012 నుంచి ఎస్‌వైఎమ్‌ఎస్ వర్క్ ఆఫ్ మెర్సీ అవార్డుని హ్యుమానిటేరియన్, జెనరస్ సర్వీస్ రంగాల్లో అత్యున్నతమైన పేరు ప్రఖ్యాతులు సాధించినవారికి అందిస్తూ వస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని చింద్వారా డిస్ట్రిక్ట్‌లో దయా బాయి నలభయ్యేళ్ళుగా ట్రైబల్స్తో కలిసి నివసిస్తున్నారు. ఆమె తన సేవల్ని దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరించారు. అలాగే బంగ్లాదేశ్‌లోనూ ఆమె సేవలందించినట్లు ఎస్‌వైఎమ్‌ఎస్ వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..