క్యాన్సర్ పేషెంట్‌కి నాలికని అమర్చిన వైద్యులు
- February 11, 2019
నాలిక బాగంలో ట్యూమర్‌తో బాధపడుతున్న ఓ ఎమిరేటీ వ్యక్తికి వైద్యులు అత్యంత క్లిష్టమైన శస్త్ర చికిత్స తీసి, మాట రాదనుకున్న ఆ వ్యక్తికి తిరిగి మాట రప్పించారు. ఇందుకోసం తొలగించిన నాలిక భాగంలో, తొడ భాగం నుంచి సేకరించిన ఫ్లాప్‌ని వినియోగించారు. షేక్ ఖలీఫా స్పెషాలిటీ హాస్పిటల్ ఈ అరుదైన ఘనతను సాధించింది. ఈ సర్జరీలో సగభాగం నాలికను తొలగించినట్లు వైద్యులు చెప్పారు. ఆసుపత్రి చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ మైయుంగ్ వుంగ్ సుంగ్ మాట్లాడుతూ, ఏడాది కాలంగా అరవయ్యేళ్ళ ఎమిరేటీ వ్యక్తి క్యాన్సర్‌తో బాధపడుతున్నారనీ అతనికి విజయవంతంగా సర్జరీ నిర్వహించామని చెప్పారు. సియోల్ నేషనల్ యూనివర్సిటీ హాస్పిటల్‌కి చెందిన కన్సుల్టెంట్ రికన్‌స్ట్రక్టివ్ హెడ్ అండ్ నెక్ సర్జన్ ఈ సర్జరీలో పాల్గొన్నారు. సర్జరీ తర్వాత ఐదు రోజులపాటు ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో రోగిని వుంచారు. అనంతరం సాధారణ వార్డుకి తరలించారు. రెండు వారాల వైద్య చికిత్స అనంతరం, పేషెంట్ తిరిగి మాట్లాడగలుగుతున్నాడు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..