ఇండియన్ సోషల్ వర్కర్‌ని సత్కరించనున్న సొసైటీ
- February 11, 2019బహ్రెయిన్: ప్రముఖ సోషల్ వర్కర్, యాక్టివిస్ట్ దయా బాయ్‌ని సిమ్స్ జిఎఫ్‌ఎస్‌ఎస్ వర్క్ ఆఫ్ మెర్సీ పురస్కారంతో సత్కరించనున్నట్లు సైరో మలబార్ సొసైటీ (ఎస్‌వైఎమ్‌ఎస్) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పేర్కొనడం జరిగింది. సెంట్రల్ ఇండియాలో ట్రైబల్స్ అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్ కోసం ఆమె అందించిన సేవలకు గుర్తుగా ఈ గౌరవం ఆమెకు దక్కుతోంది. మనామాలో మార్చి 1న ఇండియన్ క్లబ్ ఆడిటోరియం ఇందుకు వేదిక కానుంది. 2012 నుంచి ఎస్‌వైఎమ్‌ఎస్ వర్క్ ఆఫ్ మెర్సీ అవార్డుని హ్యుమానిటేరియన్, జెనరస్ సర్వీస్ రంగాల్లో అత్యున్నతమైన పేరు ప్రఖ్యాతులు సాధించినవారికి అందిస్తూ వస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని చింద్వారా డిస్ట్రిక్ట్‌లో దయా బాయి నలభయ్యేళ్ళుగా ట్రైబల్స్‌తో కలిసి నివసిస్తున్నారు. ఆమె తన సేవల్ని దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరించారు. అలాగే బంగ్లాదేశ్‌లోనూ ఆమె సేవలందించినట్లు ఎస్‌వైఎమ్‌ఎస్ వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







