‘యాత్ర’ సినిమా పై దర్సకేంద్రుడి స్పందన
- February 13, 2019
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయా జీవితంలో భాగమైన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘యాత్ర’ ఈ నెల 8న విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ సినిమాకు వైసీపీ కార్యకర్తలు బ్రహ్మరధం పట్టారు. కాగా ‘యాత్ర’ దర్శకేంద్రుడు రాఘవేందర్ రావు తిలకించారు. అనంతరం ఈ సినిమాపై తన పేస్ బుక్ ద్వారా అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘యాత్ర చూసాను. దర్శకుడు మహి, రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్రతో పాటు ఆయన ఆశయాల్ని కూడా అద్భుతంగా తెరకేక్కించాడు. మమ్ముట్టి ఆయన పాత్రలో జీవించారు.
నిర్మాతలు విజయ్ మరియు శశి కి, వారి చిత్ర యూనిట్ కి నా కృతజ్ఞతలు..’ అంటూ పోస్ట్ చేశారు. దీంతో దర్శకుడు మహి వి రాఘవ ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ.. ఆనందంగా మీరు దీన్ని ఇష్టపడ్డారు అని పేర్కొన్నారు. సూపర్‌స్టార్ మమ్ముట్టి హీరోగా మహి.వి.రాఘవ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..