పెళ్ళి చేసుకుంటానని మహిళపై అఘాయిత్యం చేసిన కువైటీ
- February 14, 2019
కువైట్ సిటీ: 20 ఏళ్ళ కువైటీ వ్యక్తి, ఓ మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పెళ్ళి చేసుకుంటానని నమ్మించి తనపై అత్యాచారం చేశాడంటూ బాధిత మహిళ, కువైటీ వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్ళి విషయమై మాట్లాడేందుకు రావాలని పిలవడంతో అతనితోపాటు కారులో వెళ్ళాననీ, అయితే కేఫ్‌కి తీసుకెళతానని చెప్పిన ఆ వ్యక్తి తన ఫ్లాట్‌కి తీసుకెళ్ళి తనపై అత్యాచారం చేశాడని మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. అత్యాచారం అనంతరం, తనన విడిచిపెట్టి వెళ్ళిన కువైటీ వ్యక్తి మళ్ళీ కనిపించలేదనీ, మొబైల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయిందని వివరించింది బాధిత మహిళ. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..