మహిళల రక్షణకై భారత ప్రభుత్వ చర్యల్ని ఆహ్వానించిన యూఏఈలోని భారత మహిళలు
- February 14, 2019
భారత పార్లమెంటులో ఇటీవల కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ప్రవేశపెట్టిన ప్రపోజల్ బిల్లుపై యూఏఈ రెసిడెంట్స్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రపోజల్ అమల్లోకి వస్తే, భారతదేశం నుంచి విదేశాలకు వెళ్ళి అక్కడే స్థిరపడ్డ భారతీయులెవరైనా తమ భార్యలను పట్టించుకోకపోతే భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడానికి వీలు కలుగుతుంది. ప్రస్తుతం ఇలాంటి వెసులుబాటు ఏదీ లేకపోవడంతో మహిళలు, తమ భర్తలు తమను వదిలేశాక తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. తాజా ప్రపోజల్ ప్రకారం విదేశాల్లో స్థిరపడాలనుకునే భారతీయులు తమ పెళ్ళిని ఇండియాలో రిజిస్టర్ చేసుకోవాల్సి వుంటుంది. ఆ సమయంలోనే వారి పాస్పోర్ట్ డిటెయిల్స్ తీసుకుంటారు. ఒకవేళ భార్యను భర్త వదిలేస్తే, ఆ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసినట్లయితే వెంటనే భర్త తాలూకు ఆస్తుల్ని జప్తు చేయడం, పాస్పోర్ట్ని రద్దు చేయడం చేస్తారు. ఈ ప్రపోజల్ వల్ల చాలామందికి మేలు కలుగుతుందనీ, అక్రమార్కులకు చెక్ పెట్టవచ్చునని యూఏఈ రెసిడెంట్స్ అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..