పాస్‌పోర్ట్ రెన్యువల్: కొత్త సర్వీస్ ప్రారంభం
- February 14, 2019
షార్జా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వద్ద '24 హవర్ పాస్‌పోర్ట్ ఆఫీస్'ని ప్రారంభించారు. ఈ కార్యాలయంలో యూఏఈ జాతీయులు తమ ఎక్స్పైర్డ్ పాస్‌పోర్టుల్ని నిమిషాల్లోనే రెన్యువల్ చేసుకోవడానికి వీలుంది. రోజులో ఇరవై నాలుగు గంటలూ ఈ సర్వీస్‌ని వినియోగించుకోవడానికి ఈ కార్యాలయం అవకాశం కల్పిస్తుంది. షార్జా డిప్యూటీ రూలర్, క్రౌన్ ప్రిన్స్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ బిన్ సుల్తాన్ అల్ కాసిమి ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. జిడిఆర్ఎఫ్ఎ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రిగేడియర్ ఆరిఫ్ అల్ షామ్షి మాట్లాడుతూ, యూఏఈ సిటిజన్స్ కోసం ఈ కార్యాలయాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. కొత్త పాస్‌పోర్ట్ ఫొటో, రెన్యువల్ ఫీజు చెల్లిస్తే, నిమిషాల వ్యవధిలోనే పాస్‌పోర్ట్ రెన్యువల్ అవుతుందని ఆయన వివరించారు. ప్రతి ఒక్కరూ తమ పాస్‌పోర్ట్ ఆరు నెలల సమయం వరకు గడువు వుందో లేదో చూసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..