భారత్‌లో ఉగ్రదాడి, ఖండించిన యూఏఈ

- February 15, 2019 , by Maagulf
భారత్‌లో ఉగ్రదాడి, ఖండించిన యూఏఈ

భారతదేశంలో జరిగిన ఉగ్రదాడిని యూఏఈ ఖండించింది. జమ్మూకాశ్మీర్‌లో తీవ్రవాదులు, నిన్న జరిపిన మారణహోమంలో 39 మంది సీఆర్పీఎఫ్‌ సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో యూఏఈ మినిస్ట్రీ ఆఫ్‌ ఫారిన్‌ ఎఫైర్స్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ కో-ఆపరేషన్‌, ఓ ప్రకటన ద్వారా ఈ ఘటనను ఖండించడం జరిగింది. తీవ్రవాదం ఏ రూపంలో వున్నా దాన్ని ప్రపంచమంతా ముక్త కంఠంతో ఖండించాలనీ, ఆధునిక సమాజంలో హింసకు తావులేదని యూఏఈ ఆ ప్రకటనలో పేర్కొంది. మృతులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు యూఏఈ మినిస్ట్రీ విడుదల చేసిన సంతాప ప్రకటనలో ప్రస్తావించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com