మహేష్ బాబుకు అరుదైన గౌరవం..
- February 15, 2019
తెలుగు సూపర్‌స్టార్ మహేష్ బాబుకు అరుదైన గౌరవం దక్కనుంది. గత ఏప్రిల్‌లో మహేష్ బాబు మైనపు బొమ్మను తయారు చేస్తున్నట్లు ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియమ్ ప్రకటించింది. ముందుగా అనుకున్నట్లే ఆ మైనపు బొమ్మ తయారీ పూర్తిచేసింది. మలేషియాలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అతి త్వరలో మహేష్ బాబు మైనపు ప్రతిమ కొలువుదీరనుంది. ఈలోగా ఆ మైనపు ప్రతిమను హైదరాబాద్‌లో ఒకరోజు ప్రదర్శించాలని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియమ్ నిర్వాహకులు నిర్ణయించారు. ఇలా ఒక నటుడి మైనపు ప్రతిమను సొంత నగరంలో అభిమానుల మధ్య ప్రదర్శించడం మేడమ్ టుస్సాడ్స్ సంస్థకు ఇదే తొలిసారి. ఈ విధంగా మహేష్ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు మహర్షి అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఏప్రిల్‌లో మహర్షి ఘనంగా విడుదలయ్యేందుకు సన్నాహాలు చేసుకుంటోంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..