పుల్వామా ఉగ్రదాడిని ఖండించిన అమెరికా
- February 15, 2019
జమ్మూకశ్మీర్ పుల్వామా ఉగ్రదాడిని అమెరికా సహా ప్రపంచ దేశాలన్ని తీవ్రంగా ఖండించాయి. ముష్కరుల విషయంలో పాక్ తీరు మారాల్సిందేనంటూ US హెచ్చరించింది. పాక్… ఉగ్రవాదులకు మద్దతివ్వడం.. వారిని కాపాడేందుకు ప్రయత్నించడాన్ని అమెరికా తీవ్రంగా తప్పుపట్టింది. వైఖరి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుందని పాక్‌కు వార్నింగ్ ఇచ్చింది. పాక్ ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందంటూ అగ్రరాజ్యం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రపంచ దేశాల్లో గందరగోళాన్ని, హింసను వ్యాప్తి చేయడమే ఉగ్రవాదుల లక్ష్యమని US మండి పడింది. ఉగ్రవాదాన్ని అంతం చేయడంలో అమెరికా భారత్‌కు పూర్తి మద్దతిస్తుందని ప్రకటించింది. రెండు దేశాలు కలిసి ఉగ్రవాద నిర్మూలనకు కృషి చేస్తాయని పేర్కొంది. ఉగ్రదాడిని అమానవీయ చర్యగా పేర్కొన్న రష్యా… ముష్కరుల అంతానికి ప్రపంచ దేశాలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చింది. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన ఫ్రాన్స్, జర్మనీలు ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం ప్రకటించాయి.
తాజా వార్తలు
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్‌తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?
- షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!
- ఒమన్‌లో కార్మికులకు అండగా కొత్త నిబంధనలు..!!
- మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!
- కొత్త సాఫ్ట్ వేర్‌తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ







