నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు GHMC జాబ్ మేళా

- February 15, 2019 , by Maagulf
నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు GHMC జాబ్ మేళా

సికింద్రాబాద్ మండలం పరిధిలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు GHMC జాబ్ మేళా నిర్వహించ బడుచున్నది ఇందులో 10 వ తరగతి పాస్/ఫెయిల్ , ఐ,టీ.ఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ, (బీఎస్సీ, ఎమ్మెస్సీ, లైఫ్సైన్సెస్, ఫార్మసీ) యం.బీ.ఏ, బి.టెక్, ఎం.సి.ఏ, డిప్లొమా అర్హత కలిగిన 18-35 సంIIల వయస్సు గల వారు హాజరు కాగలరు, ఈ జాబ్ మేళా తేది.18.02.2019 రోజున సికింద్రాబాద్ జోన్ పరిధి లోని హరిహారా కలాభవన్ లొ ఉదయం 9.00 AM నుండి 4.00 PM వరకు నిర్వహించబడును. అభ్యర్ధులకు అవగాహన మరియు అభ్యర్ధి రిజిస్ట్రేషన్ మరియు ఆర్గనైజర్స్ పరిచయాలు ఉంటాయి, రిజిస్ట్రేషన్ ఐన అభ్యర్దులకి H.R. లతో ఇంటర్వ్యూ జరిపి అభ్యర్ధికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వబడును. ఇందులో దాదాపు ఇరవై పైగా సంస్థలు వారి H.R.లు పాల్గొంటారు. కాబట్టి ఆస‌క్తి కలిగిన, పైన పేర్కొన్న అర్హతలు కలిగిన అభ్యర్ధులు Xerox కాపీలు మరియు 5 సెట్ల C.V. లతో హాజరు కాగలరని కోరడమైనది. నిరుద్యోగ యువత కోసం నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాను సద్వినియోగ పరుచుకొని ఉద్యోగావకశాలని అంది పుచ్చుకోగలరు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com