పాకిస్తాన్ హై కమిషనర్‌కు సమన్లు..
- February 15, 2019
పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రదాడి ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది... దీంతో పాకిస్థాన్ హై కమిషనర్ సోహేల్ మహమూద్‌కు సమన్లు జారీచేసినట్టు భారత విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే తెలిపారు. సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో పాక్ రాయబారికి సమన్లు జారీ చేశారు. ఉగ్రవాద సంస్థ జైషే మహ్మాద్‌పై పాకిస్థాన్ తక్షణమే కఠినమైన నిర్ణయం తీసుకోవాలని పాకిస్థాన్ రాయబారిని ఆదేశించింది భారత విదేశాంగశాఖ. పాకిస్థాన్ నుంచి సాగుతోన్న అన్ని రకాల ఉగ్ర కార్యకలాపాలను అడ్డుకునే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది. ఇక పుల్వామా దాడిపై పాక్ విదేశాంగ శాఖ ప్రకటనను కూడా భారత విదేశాంగ శాఖ ఖండించింది. కాగా, పుల్వామా ఘటనలో మృతిచెందిన జవాన్ల సంఖ్య 49కి చేరింది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







