వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన మోదీ
- February 15, 2019
భారత్‌లో తయారైన మొట్టమొదటి సెమీ హైస్పీడ్ రైలు 'వందే భారత్ ఎక్స్‌ప్రెస్'ను ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. జమ్ము, కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో గురువారం సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి నేపథ్యంలో దేశమంతటా విషాదఛాయలు అలుముకున్నప్పటికీ మందుగా నిర్దేశించుకున్న కార్యక్రమం కావటంతో ప్రధాని మోదీ, కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఇవాళ దిల్లీ నుంచి వారణాసి బయలుదేరుతున్న ఈ అత్యాధునిక రైలును రూపొందించడానికి విశేషంగా కృషి చేసిన ఇంజినీర్లకు, నిపుణులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నాలుగున్నరేళ్లలో నిజాయతీగా కష్టపడి రైల్వే అభివృద్ధికి కృషిచేశామని చెప్పారు.
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేకతలు
* 'ట్రైన్ 18'గా ఉన్న ఈ రైలుకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌గా నామకరణం చేశారు. గంటకు 160కిమీ వేగంతో ఇది ప్రయాణించగలదు.
* దిల్లీ -వారణాసిల మధ్య గమ్యాన్ని 9 గంటల 45 నిమిషాల్లో చేరుకునే ఈ రైలు కాన్పూర్, అలహాబాద్‌లో మాత్రమే ఆగుతుంది.
* 1128మంది ప్రయాణికుల సామర్థ్యంతో 16ఏసీ కోచ్‌లున్నాయి.
* వైఫై సౌకర్యం, ఆటోమేటిక్ డోర్లు, జీపీఎస్ ఆధారంగా ప్రయాణికులు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకొనే వెసులుబాటు.
* బయో వ్యాక్యూమ్ టాయ్‌లెట్స్
* ప్రతి సీటు వద్ద అవసరం మేరకు కాంతిని మార్చుకోగలిగే లైట్ల సదుపాయం.
* ప్రయాణికుల అభిరుచికి తగినట్లుగా వేడివేడి ఆహారపదార్థాలు, ద్రవపదార్థాలు సరఫరా చేసే ప్యాంట్రీ.
* 30శాతం ఇంధనాన్ని ఆదా చేసేలా రూపొందించిన బ్రేకింగ్ సిస్టమ్.
* ఛైర్‌కార్ టికెట్ ధర రూ.1760, ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ ధర రూ.3310
* కేవలం 18నెలల వ్యవధిలోనే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో దీనిని చెన్నైలో తయారు చేశారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..