వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలుకు ఆదిలోనే ఇబ్బందులు
- February 16, 2019
ప్రతిష్టాత్మకమైన వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలుకు ఆదిలోనే ఇబ్బందులు తలెత్తాయి. అత్యంత వేగంగా వెళ్లే ఈ రైలు రెండవ రోజే సాంకేతిక కారణాలతో నిలిచిపోయింది. ఈ ఉదయం వారణాసి నుంచి ఢిల్లీకి బయలుదేరిన వందే భారత్ ఎక్స్ప్రెస్ తుండ్లా స్టేషన్ వద్ద ఆగిపోయింది. ఓ ఆవును ఢీకొనడంతో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. తుండ్లా స్టేషన్ వద్ద సుమారు 3 గంటల పాటు రైలును ఆపేశారు.
ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న సమయంలో ఆ రైలు గంటకు 130 కిలోమీటర్ల టాప్ స్పీడ్ వేగంతో వెళ్లింది. అయితే ఇవాళ సాంకేతిక లోపం తలెత్తడంతో.. ఆ రైలును కేవలం 40 కిలోమీటర్ల వేగంతో తీసుకువెళ్లారు. ఢిల్లీకి 200 కిలోమీటర్ల దూరంలో అది నిలిచిపోయింది. నిన్న వందే భారత్ ఎక్స్ప్రెస్ను ఢిల్లీలో ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. రైలు ప్రారంభించిన మరుసటి రోజే సాంకేతిక సమస్యలు తలెత్తడం చర్చనీయాంశంగా మారింది.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!