నా పొట్టలో బుజ్జి బాబు ఉన్నాడేమో:లాస్య మంజునాథ్
- February 16, 2019
యాంకర్‌గా బుల్లితెరను ఒక ఊపు ఉపిన లేడీ ఆర్టిస్ట్ లాస్య. తన మాటల చాతుర్యంతో బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఓ డాన్స్ షో లో తనదైన స్టయిల్‌లో కామెడీ చేస్తూ ఆ షోకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది లాస్య. ముఖ్యంగా చీమ – ఏనుగు జోక్స్‌తో సమ్‌థింగ్ స్పెషల్‌గా మారింది. తన యాటిట్యూడ్‌తో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ క్యూట్ యాంకర్.. మంజునాథ్ అనే మరాఠీ యువకుడిని పెళ్లి చేసుకుని బుల్లితెర మీద కనుమరుగైంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గానే ఉంటుంది.
ఈ నేపథ్యంలోనే శుక్రవారం తన సెకండ్ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. తను తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసింది. ‘ఈ స్పెషల్ అకేషన్ సందర్భంగా మీతో ఒక శుభవార్తను పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. మా ప్రతిరూపం సిద్ధమవుతోంది. త్వరలోనే మేము ముగ్గురం కాబోతున్నాం’ అని లవ్లీగా చెప్పింది లాస్య. ప్రస్తుతం తనకు 8వ నెల అని.. బాబు కావాలనుందని తన మనసులో మాటని బయటపెట్టింది ఈ ఫన్నీ యాంకర్.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..