కతర్:'MADLSA' నిర్వహించిన ప్రతినిధుల సదస్సు
- February 16, 2019
కతర్:కతర్ మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ లేబర్ అండ్ సోషల్ అఫైర్స్ (MADLSA)వారు నిర్వహించిన ప్రతినిధుల సదస్సులొ కతర్ లొని తెలంగాణ ప్రాంత ప్రజల ముఖ్యంగా కార్మికుల తరఫున పాల్గొన్న తెలంగాణ గల్ఫ్ సమితి బృందం.
ఈ సందర్భంగా తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు సుందరగిరి శంకర్ మంత్రివర్గ నిపుణలకు ,అధికారులకు కార్మికుల పడుతున్న కష్టాలను,సమస్యలను తెలియ చేసారు.వాటి నివారణకు దయచేసి చర్యలు తీసుకోవాలని కోరారు.ముఖ్యంగా 3 విషయాలు వారి దృష్టికి తీసుకురావడం జరిగింది.
దొంగ మొసకారి ఏజెంట్లు పని లెకున్నా కంపనీ లు సృష్టించి అమయాకులైన తెలంగాణ ప్రజలకు వీసాలు అమ్మి మోసం చెస్తున్న విధానాన్ని వారి దృష్టికి తీసుకురావడం జరిగింది.
ఇటువంటి మోసాలాకు పాల్పడుతున్న వారి భరతం పడుతామని వారి వివరాలు తెలుపాలని మినిస్ట్రీ వారు కోరడం జరిగింది.
ఇక్కడకు వచినంక మధ్యలో కంపనీ బంద్ అయి తినడానికి తిండి ఉండడానికి రూమ్ లేక బాధలు పడుతున్న వారికొసం తాత్కాలిక నివాస కేంద్ర రేస్క్యు హోమ్ త్వరగా ఏర్పాటు చేయాలని విసా గడువు ముగిసి ఫైన్ లు కట్టలేక ఇంటికి తిరిగి వెల్ల లెక బాధ పడుతున్న వారి ఫైన్ లు మాఫీ చేసి వాళ్లు దేశం తిరిగి వెళ్లే వీలు కల్పించాలని వినతి చెయడం జరిగింది.
ఈ కార్యక్రమం లో గల్ఫ్ సమితి నాయకులు మహేందర్ చింతకుంట మల్లేష్ సుద్దవేని, యెల్లయ్య తల్లాపెల్లి ఇతర నాయకులు పాల్గొన్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,కతర్)
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..