పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్లు మేం ప్రసారం చేయం
- February 18, 2019
ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా దాడి భారతదేశంలోనే కాదు. అంతర్జాతీయంగా ప్రభావం చూపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తితో కళ్లప్పగించి చూసే క్రికెట్ మీదా ఎఫెక్ట్ చూపెడుతోంది. దిగ్గజాలుగా పేరొందిన పాకిస్తాన్ క్రికెటర్ల ఫొటోలను పంజాబ్లోని మొహాలీ స్టేడియం వేదికగా మేనేజ్మెంట్ తొలగించింది. అంతేకాకుండా దేశీవాలీ లీగ్లో దినదినాభివృద్ధి చెందుతోన్న పాకిస్తాన్ సూపర్ లీగ్.. ప్రసారాలను కూడా ఆపివేస్తామంటూ బ్రాడ్కాస్టర్లు వెనక్కితగ్గారు.
ఉగ్రదాడిలో పాకిస్తాన్ నిషేదిత ఉగ్రవాది జైషే మొహమ్మద్ ఉండటం, దాడిపై పాకిస్తాన్ పూర్తి వ్యతిరేకత చూపకపోవడంతో అభిమానుల్లో ఆగ్రహజ్వాలలు రేగేందుకు కారణమయ్యాయి. ఈ మేర ఐఎంజీ రిలయన్స్ ప్రసారాలను ఆపివేయాలని నిర్ణయం తీసుకుంది. రాజకీయ కారణాలతో పాకిస్తాన్తో మ్యాచ్లు ఆడేందుకు సమ్మతించని భారత్.. ఈ ఉగ్రదాడి కారణంగా ప్రసార సేవలను కూడా ఆపేయడంలో ఆశ్చర్యమేమీ లేదు.
పీసీబీ ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకుని నాలుగో సీజన్లోకి అడుగుపెట్టింది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ లీగ్లో ఆరు జట్లు పాల్గొంటున్నాయి. ఫైనల్ మ్యాచ్లు మాత్రం కరాచిలో ఆడించాలని మేనేజ్ మెంట్ నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..