హీరో నాని దర్సకుడు విక్రమ్ ల సినిమా ప్రారంభం
- February 18, 2019
24 దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని 24వ సినిమా ప్రారంభం అయ్యింది. ఈరోజు పూజా కార్యక్రమాన్ని నిర్వహించి సినిమాను ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు కొరటాల శివ పాల్గొన్నారు. రేపటి సినిమా నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం కానుంది.
ఈ చిత్రంలో నానికి జంటగాప్రియాంక అరుళ్ మోహన్ నటించనున్నారు. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యహరించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవి శంకర్, మోహన్ చెరుకూరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యహరించనున్నారు.
మరోవైపు, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని- శ్రద్దా శ్రీనాథ్ జంటగా 'జెర్సీ' సినిమా తెరకెక్కుతోంది. ఇందులో నాని.. అర్జున్ అనే క్రికెటర్ పాత్రలో నటిస్తున్నారు. 1990 దశకానికి చెందిన ఓ క్రికెటర్ జీవితం నేపథ్యంలో సినిమాను తెరకెక్కిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ స్వరాలు అందించారు.ఏప్రిల్‌లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!