డిఫరెంట్ లుక్‌లో అదరగొడుతున్న శర్వా..
- February 20, 2019
కథాబలం ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ సినిమాలు చేసే హీరోల్లో శర్వానంద్ ఒకరు..ఇటీవల ఆయన పడి పడిలేచే మనసు లో నటించిన సంగతి తెలిసిందే.. ఈచిత్రం తర్వాత ప్రస్తుతం ఆయన స్వామి రారా ఫేం సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.ఇంకా టైటిల్ ఖరారు కాని ఈసినిమాలో కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.. ప్రస్తుతం ఈచిత్రం షూటింగ్ స్పెయిన్‌లో జరుగుతోంది.. ఈ షెడ్యూల్‌లో 250 మంది డ్యాన్సర్లతో శర్వా, కాజల్‌పై సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు.తాజాగా విడుదలైన ఈసినిమా స్టిల్స్‌లో శర్వా మిడిల్ ఏజ్డ్ పర్సన్ లుక్‌లో డిఫరెంట్‌గా కన్పిస్తున్నారు.. ఈ చిత్రంలో శర్వా రెండు పాత్రల్లో కన్పించనున్నారు.. ఒకటి యువకుడిగా, మరొకటి మిడిల్ ఏజ్డ్ పర్సన్‌గా.. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈచిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







