రోడ్డు ప్రమాదం: కోమాలో భారతీయ మహిళ
- February 20, 2019
దుబాయ్: ప్రమాదంలో గాయపడ్డ ఓ మహిళ కోమాలోకి వెళ్ళిపోవడంతో ఆమెను బతికించేందుకుగాను సౌత్ దుబాయ్ కమ్యూనిటీ నిధుల సేకరణ చేపట్టారు. రిటైర్డ్ ఇంగ్లీషు ప్రొఫెసర్ అయిన 61 ఏళ్ళ సుచిత్ర ప్రతాప్, డిస్కవరీ గార్డెన్స్‌లో వున్న తన కుమారుడి కుటుంబాన్ని సందర్శించే క్రమంలో ప్రమాదానికి గురయ్యారు. ఫిబ్రవరి 6న ఈ ఘటన జరిగింది. బాధిత మహిళ కుమారుడైన నవదీప్ ప్రతాప్ మాట్లాడుతూ, తన తల్లి వస్తున్న సమయంలో అక్కడే ఫుట్‌బాల్ ఆడుతున్న ఓ వ్యక్తి చూసుకోకుండా అతి వేగంతో దూసుకొచ్చి ఢీకొట్టాడనీ, దాంతో తన తల్లి కింద పడిపోయిందని చెప్పారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించామని, ఆమె కోమాలోకి వెళ్ళినట్లు వైద్యులు నిర్ధారించారని చెప్పారు నవదీప్ ప్రతాప్. రెండు వారాల తర్వాత సుచిత్రకు వెంటిలేటర్ తొలగించారు వైద్యులు. అయితే ఆమె ఇంకా కోమాలోనే వున్నారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు నవదీప్ ప్రతాప్. ఆసుపత్రి ఖర్చులు పెరిగిపోతున్నాయనీ, ఇప్పటికే 300,000 దిర్హామ్‌లు ఖర్చయిందనీ, హైద్రాబాద్‌కి తరలించాలనుకుంటున్నామనీ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న ప్రతాప్ చెప్పారు. కమ్యూనిటీ మెంబర్స్ తమకు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు వివరించారు. ఎయిర్ అంబులెన్స్ కోసం నెగోసియేషన్స్ చేస్తున్నామనీ, ఇండియన్ కాన్సులేట్‌తో సంప్రదింపులూ జరుపుతున్నామని చెప్పారాయన.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..