సినీ ఇండస్ట్రీలో మరో విషాదం..
- February 22, 2019
బాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. వర్ధమాన నటి సంఘమిత్ర రాయ్ ఛటర్జీ మృతి చెందారు. వెండితెరపై అవకాశాలు అందిపుచ్చుకుంటూ.. నటిగా ఎదుగుతున్న ఈ యంగ్ హీరోయిన్ గత కొన్ని రోజులుగా బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హఠాత్తుగా క్యారాబెల్ అటాక్ రావడంతో ఆమె మృత్యువాత పడింది. రెండేళ్ల పాటు మృత్యువుతో పోరాడిన సంఘమిత్ర.. అలసిపోయి మరణం ముందు ఓడిపోయి.. చివరకు గురువారం నాడు మృత్యువు ఒడిలోకి చేరింది.
‘దామిని’, గహీన్ హృదయ్’ , దేక్ కమాన్ లగే’, మూవీలో నటించింది సంఘమిత్ర. నటిగా, మోడల్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె నిర్మాతగానూ తనను తాను నిరూపించుకోవాలని ఆశపడింది. ఇందులో భాగంగానే నిర్మాత ప్రదీప్ చురీవాల్తో కలిసి ఓ సినిమా నిర్మించేందుకు కూడా రెడీ అయింది. సంఘమిత్రకు ఆరేళ్ల కూతురు ఉంది. అయితే ఆమె తన భర్త నుంచి విడాకులు తీసుకుని.. వెండితెరపై రాణించేందుకు ప్రయత్నాలు చేసినట్లు సమాచారం.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..