వలసదారుడి జీవితాన్ని కాపాడిన ఎమిరేటీ మహిళ
- February 22, 2019
అజ్మన్:ఓ వలసదారుడికి గుండె పోటు రాగా, అతన్ని రక్షించింది అజ్మన్‌లో ఓ ఎమిరేటీ మహిళ. దుబాయ్‌లోని వర్క్ ప్లేస్ నుంచి ఎమిరేటీ జాతీయురాలైన హింద్ అలి అల్ తహెరి వెళుతుండగా, ఓ వ్యక్తి తీవ్ర అస్వస్థతో బాధపడుతున్నట్లు గుర్తించారు. బాధపడుతున్న వ్యక్తికి సహకరించేందుకు మరో ఇద్దరు వ్యక్తులు ప్రయత్నించినా వారి వల్ల కావడంలేదు. దాంతో ఎమిరేటీ మహిళ తన వాహనాన్ని ఆపి, అతన్ని బతికించేందుకు ప్రయత్నించారు. వెంటనే 998 (ఎమర్జన్సీ)కి కాల్ చేశారామె. పారామెడిక్ సిబ్బంది అందించిన సమాచారంతో, బాధితుడికి ప్రాథమిక వైద్య చికిత్స చేశారు. దాంతో బాధితుడు స్పృహలోకి వచ్చారు. ఈలోగా అంబులెన్స్ అక్కడికి చేరుకుని, బాధితుడ్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గతంలోనే తాను ఫస్ట్ ఎయిడ్ గురించి తెలుసుకోవడం వల్ల తగిన సమయంలో తక్షణ వైద్య సహాయం అందించగలిగినట్లు చెప్పారు అల్ తహెరి. వైద్యులు, అల్ తహెరి సమయస్ఫూర్తిని కొనియాడారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..